రాంపూర్ గ్రామంలో అమల, విమల ఇద్దరు స్నేహితురాళ్లు ఉండేవారు.బడికి వెళ్లి బాగా చదువుకునేవారు.సార్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవారు. ఇంటివద్ద హోంవర్క్ చేసుకునేవారు.సాయంకాలం వేల కొద్దిసేపు ఆడుకునేవారు.రాత్రివేళ అమల ఇంటికి వెళ్లి చదువుకునేది విమల.ఇలా వీరి స్నేహం బలపడింది.ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.
ఒకరోజు అమల బడికి రాలేదు.విమలకు మనసుకు పడతలేదు.అమల ఎందుకు బడికి రాలేదు అని తెలుగుసార్ విమలను అడుగుతాడు.ఏమో సార్ నాకు తెలియదు అంటుంది విమల.బడి అయిపోయాక విమల తొందరగా హోంవర్క్ చేసుకొని అమల వాళ్ళ ఇంటికి వెళ్తుంది.అమల ఇంటికి తాళం వేసి ఉంది. అమలకు ఏమైందని అని చుట్టుపక్కల వారిని అందరిని అడుగుతుంది.ఎవరు మాకు తెలియదు మాకు తెలియదని అన్నారు.మరునాడు గూడా పాఠశాలకు రాలేదు.పది రోజులైనా అమల బడికి రాలేదు.తెలుగు సార్ విమలను తోలుకొని అమల ఇంటికి వెళ్ళుతారు.వాళ్ల నాన్న అప్పుడే డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు.
ఏం నారాయణ అమల ఎందుకు బడికి రావడం లేదని అడిగాడు.అప్పుడు నారాయణ ఇలా చెప్పాడు. మేము అమల కలిసి ఊరికి వెళ్తున్నాం.అనుకోకుండా మా వాహనానికి ప్రమాదం
జరిగింది.కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకున్నాయి.
కంటి చూపు కోల్పోయింది.
ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తున్నానని చెపుతాడు. అయ్యో!నా స్నేహితురాలకు కళ్లు పోయినవా! ఓ దేవుడా!ఎందుకిలా చేశావు.అమలకు కళ్లువచ్చే మార్గమే లేదా! అని డాక్టర్లను అడుగుతుంది విమల.ఏవరైన కండ్లు దానంచేస్తే చూపువస్తుందని డాక్టర్లు చెపుతారు.అప్పుడు విమల ఆలోచించి డాక్టరును కలిసి నేను ఒక కన్నును దానం చేస్తాను.రెండో కన్నుతో చూడవచ్చుగదా!అనుకుంటుంది.వెంటనే కన్ను స్నేహితురాలు అమలకు ఇస్తుంది.విమల ఒక కన్నుతోనే ఉంటుంది.అమల త్వరగా కోలుకుంటుంది
విమలా! నువ్వు ఎందుకు నాకు కన్ను ఇచ్చావు అని అడుగుతుంది.ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇచ్చాను.నువ్వు ఒక కన్నుతో నన్ను చూడవచ్చు.
నేను ఒక కన్నుతో నిన్ను చూడవచ్చు కదా! అందుకే మన స్నేహానికి గుర్తుగా నా కన్నును ఇచ్చాను.ఆనాటి నుంచి వాళ్ల స్నేహితం మరింత బలపడింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి