నిజాయితి పోలీస్ :- బట్టల సాయిచరణు-8వ, తరగతి -ZPHS: బక్రిచెప్యాల -సిద్దిపేట జిల్లా-చరవాణి:6300424048.
 ఒక ఊర్లో మల్లయ్య,పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్నకు ఇద్దరు కొడుకులు, తమ్ముడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.కొన్ని రోజులకు పుల్లయ్య అనారోగ్యంతో మరణించాడు.అప్పుడు తమ్ముని ఆస్తి మీద దుర్బుద్ధి కలిగిందిమల్లయ్యకు. అప్పుడు మల్లయ్య ఒక పోలీసును కలిశాడు.ఎలాగైనా మా తమ్మునికి చెందాల్సిన ఆస్తి నాకు వచ్చేలా చెయ్యాలంటాడు.నీకు కొంత డబ్బు సహాయం చేస్తాననిఒప్పందం చేసుకుంటాడు.పోలీస్ చాలా నిజాయితీగలవాడు. పుల్లయ్య కుటుంబ పరిస్థితిని పోలీస్ గమనిస్తాడు.పుల్లయ్య భార్య చాలా కష్టపడుచు ఆడపిల్లలను చదివిస్తుంది.ఈ విషయాన్ని పోలీస్ గమనిస్తాడు.పుల్లయ్య పిల్లలకు న్యాయం చేయాలని పోలీస్ అనుకుంటాడు.
అప్పటినుంచి మల్లయ్య  ఇస్తున్న డబ్బులతో పుల్లయ్య పిల్లల్ని చదివిస్తాడు.ఈ కేసును  పోలీసు ఎప్పుడు వాయిదా వేస్తు వస్తున్నాడు.
మల్లయ్య నుంచి వస్తున్న డబ్బులతో ఒకమ్మాయిని డాక్టర్ని చేశాడు.ఒకమ్మాయిని పోలీస్ ను చేశాడు.
దీంతో మల్లయ్య ఆస్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది.మల్లయ్య ఇద్దరు కొడుకులు సోమరులయ్యారు.తాగుడుకు బానిసయ్యారు.నాకు ఎందుకు ఇట్లాఔతుంది అనిఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తుంటాడు.ఇంతలో వేగంగా వస్తున్న వాహనం మల్లయ్యను డీకొట్టింది.
వెంటనే దగ్గరున్న ఆసుపత్రికి తీసుకెళ్లారు.
డాక్టరమ్మ ఇతను మా పెదనాన్న అని గుర్తించి చికిత్స చేస్తుంది.మల్లయ్య సృహలోకివచ్చి నంక డాక్టరమ్మ మా తమ్ముడి కూతురని గుర్తిస్తాడు.నన్ను క్షమించమ్మ అని వేడుకుంటాడు.నేనే మీ ఆస్తిని కాజేయాలని చూశాను దేవుడు నాకు తగిన శాస్తి చేశాడని బాధపడుతాడు.
అప్పుడే పోలీస్ వస్తాడు.నా తప్పును క్షమించమని మల్లయ్య అడుగుతాడు.నీ విచ్చిన డబ్బంతా మీ తమ్ముని పిల్లల చదువులకు ఖర్చుపెట్టాను.వారిని గొప్పవారిని చేశాను.
అప్పటి నుండి మల్లయ్య మారిపోతాడు.

కామెంట్‌లు