శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - వ్యాఖ్యానము :- భాగం - 8
 ఆదిశన్కర భగవత్పాదుల అంతటి మహనీయుడు శ్రీ భాస్కరరాయలు వారు, అని లలితా పరా భట్టారిక చేత చెప్పబడిన శ్రీ భాస్కరరాయలవారి చరితము తెలుసుకుందాము.
"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
శ్రీ భాస్కరరాయలవారి జీవిత కాలంలో అనేక మహిమాన్వితమైన విషయాలు జరిగాయి. మనం మచ్చుకు ఒక నాలుగు మహిమా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.....
3.మరాఠా రాజ్యంలో చంద్రసేన జాధవ్ అనే సైన్యాధిపతి వుండేవారు. రాజకీయ కారణాల వల్ల నిజాం నవాబు దగ్గరకు వెళ్ళారు. చంద్రసేన జాధవ్ ను, కర్నాటక లోని భాల్కి పరగణాకు అధికారిని చేసాడు, నిజాం నవాబు. కొంతకాలానికి, చంద్రసేన జాధవ్ మీద దురుద్దేశం తో, ఒక ఫకీర్ ఆతనిపై క్షుద్ర శక్తులను ప్రయోగించి, పిచ్చి వానిగా చెస్తాడు. 
దేశ పర్యటన కొనసాగిస్తున్న భాస్కరరాయలు గారు, భాల్కి పరగణాకు వచ్చారు. అక్కడ చంద్రసేన జాధవ్ గారి భార్య ద్వారా చంద్రసేన జాధవ్ పిచ్చివాని గా మార్చబడ్డాడు అని తెలుసుకుంటారు.
దయామయులైన భాస్కరరాయలు గారు, తాను శ్రీలలితా సహస్రనామ పారాయణ లో పరిపూర్ణులు అవడం వల్ల, వారాహీ దండనాయకిని ప్రార్ధన చేసి, చంద్రసేన జాధవ్ కు క్షుద్ర శక్తుల బాధలనుండి విముక్తి కలిగించారు. ఇది లలితా పరాత్పరి కరుణతో సాధ్యము అయ్యింది.
..... రేపు వేరొక మహిమ చూద్దాము.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....

కామెంట్‌లు