గ్రామకోకిల:- గర్నెపల్లి రక్షిత -9వ తరగతి-ZPHS:బక్రిచెప్యాల-జిల్లా.సిద్ధిపేట.-చరవాణి:7032594107.
 ఒక ఊరిలో దేవలక్ష్మి అనే ముసలమ్మ ఉండేది.ఆ అవ్వకు నలుగురు కూతుళ్లు. భర్త మరణించాడు.ఉన్న కొద్దిపాటి భూమిఅమ్ముతుంది. కూతుళ్లకు సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి అత్తవారిళ్లళ్లకు పంపుతుంది.అవ్వ ఒంటరి అయిపోయింది.
తన కూతుళ్లు చిన్నగా ఉన్నప్పటి నుండి ఆ ఊరి బడిలో వంట చేస్తుండేది.65 సంవత్సరాల వయసు  వచ్చింది.పిల్లల తల్లిదండ్రులు అవ్వా! నీకు వయసు అయిపోయింది.అందువల్ల బడిలో వంట చేయకూడదు అని అంటారు.అప్పుడు అవ్వకు గుండెలో రాయిపడ్డట్టు అయింది.ఉన్న ఒక్క ఆధారం పోయింది.
అప్పుడు అవ్వ దిక్కులేని అనాధ అయిపోతుంది.
కూతుళ్ల ఇండ్లళ్ళళ్లకు పోయేది కాదు.ఏం చేయాలి అని తనలో తానే బాధపడుతుంది.
అవ్వని చూసిన వాళ్లందరు అవ్వా! నువ్వు బాధపడకు మేమంతా ఉన్నాము అని గ్రామస్తులు ధైర్యం చెపుతారు. వాళ్ళందరూ ప్రతిరోజు మందలించుకుంటు పోతుంటే బాధలన్ని మరిచిపోయేది.
అవ్వ గ్రామస్తులకు ఒక ఆయుర్వేద డాక్టరు లాగా పనిజేసేది.ఎవ్వరింట్ల ఆపద గలిగిన తనవంతు సేవ చేసేది. గ్రామంలోని బడికి చిన్న పిల్లలకు మంచి మంచి కథలు చెప్పుతూండేది.అవ్వ కథలంటే పిల్లలకు మహాఇష్టం.
బతుకమ్మ పండుగ వస్తే చాలు తొమ్మిది రోజులు అవ్వతోటే పాటలు పాడించుకునేవారు.
అవ్వకు రాని పాటల్లేవు.
అవ్వకు గ్రామ కోకిల అని బిరుదిచ్చారు.
గ్రామస్తులు అవ్వకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేటట్లు,బియ్యం వచ్చేటట్లు చేస్తారు.కూరగాయల దుకాణం పెట్టిస్తారు.రైతుల వద్దకు వెళ్ళి కూరగాయలు తెచ్చి గ్రామస్తులకు అమ్మేది.అవ్వ జీవితం సంతోషంగా గడుస్తుంది.
ఎవ్వరు లేని అనాధలకు గ్రామస్తులే కొడుకులు, కూతుళ్లు అని నిరూపించారు.

కామెంట్‌లు