తపాలా శాఖ! మురిపాల మావి శాఖ!: - డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.


(తపాలావ్యవస్థనాడునేడు.(ప్రపంచ తపాల దినోత్సవం సందర్భంగా)
నా పంచపదుల సంఖ్య---

1501.
ఉత్తరం మన అంతరంగ,
       అభివ్యక్తి అక్షర ప్రోది! 

ఉభయ కుశలోపరి,
 క్షేమ సమాచార సారమది! 

ఆప్యాయత అర్థమై ,
మన వాళ్ళని చూపే అద్దమది!

మధురాక్షర సుమమాల,
            ఇగిరిపోని గంధమది!

తోకలేని ఫిట్టయై మన,
 ఇంట, ముంగిట వాలుతుంది,
  పివిఎల్!

1502.
ఉత్తరం వచ్చిందంటే ,ఆ పూట, 
పెద్ద పండుగన్న మాట!

లేఖ ఏదైనా మనసుపెట్టి, వ్రాసిన ప్రేమ లేఖంట!

ఉత్తరాల బందీతో వస్తాడో,   
    ఊరందరి బంధువంట!

తపాలా బంట్రోతు సైకిల్ పై,  
       ఊర్లో తిరిగే రౌతంట!

అతడు మోగించే గంట ,
ఉత్తర వరాల గుడి గంట, 
పివిఎల్!

1503.
పోస్ట్ మేన్,.
 తిలక్ కవితా వస్తువు,
              క్షేమసేతువు!

మనీ ఆర్డర్ తెచ్చి ఇస్తాడు ,
      జన ఆనంద హేతువు! 

నిరుద్యోగికి ఉద్యోగ పత్రం.
     అందించే ఆప్త బంధువు! 

ఆదివారం అతడు రాడంటే  ,
        ఊరికి గుండె బరువు! 

సోమవారం నుండి శనివారం ,
కళ్ళు కాయలెన్నో కాచు,  పివిఎల్!

1504.
మనకు పోస్ట్ ఆఫీసులు ,
       ఎన్నో సేవలకు నెలవు! 

బ్యాంకులా అనేక ఆర్థిక , ,
       లావాదేవీలకు కొలువు!

స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టులు,
      ప్రజలకు ఎంతో హితవు! 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు,
          తెలియుట సులువు!

ఆధార్ కార్డ్ పొందుటకు, మార్పులకు ఎంతో అనువు, పివిఎల్!
_________

కామెంట్‌లు