"గురువులు విశ్వ గురువులు":- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)-సారవకోట -చరవాణి: 9490904976
 అక్షర విత్తులు నాటించి
ఆటపాటలతో ఆడిపాడించి
ఇష్టంగా బడికిరప్పించి
ఈర్ష్యాద్వేషాలు మాన్పించి
ఉపకారం నేర్పించి
ఊటబావిలా ఉపయోగపడమని
ఋషిలా 
ఋూ(రూ)ఢిగా 
ఎల్లవేళలా 
ఏకాగ్రతతో చదువుకొమ్మని
ఐకమత్యంతో అందరితో 
ఒదిగి ఉండమని
ఓరిమితో 
ఔన్నత్యంగా ఉండేలా
అంకురార్పణ చేసి
విద్యాఫలాల్ని విద్యార్థులకు
అందించేది "ఉపాధ్యాయులే".
ప్రభుత్వ ఉపాధ్యాయులైనా
ప్రైవేటు ఉపాధ్యాయులైనా
ట్యూషన్ టీచర్లైనా చదువు నేర్పేదెవరైనా 
వారందరూ విద్యార్థులకు బోధించి జ్ఞానాన్ని అందించే 

మార్గదర్శకులు, దిశానిర్దేశికులైన "గురువులు.."
కామెంట్‌లు