స్వార్థం లేని "నేను":- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)- సారవకోట -చరవాణి: 9490904976
నేను అమ్మ క్షేత్రమును .
నేను నాన్న విత్తును.
నేను ఇంటికి ముద్దును.

నేను మిత్రుల పొత్తును.
నేను బడికి ఒత్తును.
నేను గురువు సొత్తును.

నేను కొందరికి ప్రాణమిత్రుడును.
నేను ఐనవారికి ప్రాణమిత్తును.
నేను వైద్యుడినై ప్రాణంపోతును. 
నేను దేశద్రోహుల ప్రాణములుతీతును.

నేను దేశ భక్తుడును.
నేను పోరాట వీరుడును.
నేను కార్య శూరుడును.

నేను అన్యాయాలకు అడ్డుకట్టను..
నేను అక్రమార్కులను వదిలిపెట్టను.
నేను అవినీతిపరులను దాచిపెట్టను.

నేను నిజానికి వెన్నుదన్నును.
నేను వ్యతిరేకశక్తులపై గన్నును.
నేను నిర్భయంగావ్రాసే పెన్నును..

నేను అభాగ్యుల ఆపన్నహస్తుడును.
నేను దీనజనుల సేవకుడును.
నేను భగవంతుడి భక్తుడును.
నేను భరతమాత ముద్దుబిడ్డను.


కామెంట్‌లు