జ్యోతి జ్యోతి ఓ మా జ్యోతి
నీవేలే ఇక మా గృహ జ్యోతి
రావాలిగా నీకు ఇక ఖ్యాతి
కావాలిలే అది ఓ ప్రఖ్యాతి !
జ్యోతి జ్యోతి ఓ మా జ్యోతి
నీవు ఎప్పుడు తప్పుగా నీతి
చేయవు అసలే చెడు సోపతి
నీ సర్వస్వమేగా ఇక నీ పతి. !
నీకు ఉన్నది లే చిత్తశుద్ధి
చేసుకుంటావులే అభివృద్ధి
సరిపోయేది నీకా సమృద్ధి
అదేగా నీ కోరే పురోభివృద్ధి !
ఇద్దరి పాపల ముద్దుల తల్లివి
సరిహద్దుల సిరిగల మాశ్రీవల్లివి
అక్షర సంపద వారికి అందించావు
లక్షణంగా వారినిక నీవు పెంచావు!
కుటుంబ సభ్యులతో కలిసుంటావు
ఇది నిజమా కాదా నీవేమంటావు
ఇక ఏం చెప్పినా ఒప్పుకుంటము
తప్పొప్పులనెంచక
తప్పుకుంటము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి