జీవుల సంజీవిని మా వాన:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి
వాన వాన ఓ మా వానా
మాపై కురిసేది ఇక నీవేనా
చినుకు చినుకుగా వస్తావు
చిటపట దరువులు వేస్తావు !

జలజల కురుస్తూ నీవు వస్తావు
జలరాసులను మాకు అందిస్తావు
చెరువులు దొరువులు నింపేస్తావు
గలగల పారుతూ ఇక చిందేస్తావు !

వానా వానా ఓ మా వానా
నీవు ఉన్నావు ఆకాశం పైన
మేఘాలతో పడతావులే కుస్తీ
మెరుపులతో చేస్తావులే దోస్తీ !

ఆర్థిగా భూమాతను ప్రేమిస్తావు
దాహార్తిని తీర్చగా పయనిస్తావు
వెళితే లేకుండా నింపేవు కుంటల
ఫలితంగా పండిస్తావులే పంటల !

జీవుల కోసమే నీవు జీవిస్తావు
సంజీవినివై వారిని కరుణిస్తావు
కరుణాసముద్రమే నీ హృదయం
ఎవరికుంటుంది ఈ సహృదయం !

కరువు కాటకాలు ఇకపై ఉండవు 
వాన లేకుండా కడుపులు నిండవు
మా భూముల్లో పంటలు పండవు
సుఖ సంతోషాలు ఇలపై ఉండవు !



కామెంట్‌లు