గాలి ఓ మా చిరుగాలి:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి
గాలి గాలి ఓ చిరుగాలి
పవనాలుగా నీవిక తేలి
నీవస్తావులే మా ఇంటికి
 నచ్చావులే మా కంటికి !

నీ వల్లే మాకు ఊపిరి ఉంది
నీవు లేకుంటే కలుగు ఇబ్బంది
మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు
అవునా కాదా  ఇక ఏమంటావు ?

నీ సమాధానం ఇక ఏదైనా
నీవు లేకుండా పోదు పొద్దైనా
ఓ గాలితల్లి మా చిరుగాలి మల్లి
నీవు లేక ప్రాణం ఉండదులే మళ్ళి

చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు
అట్లనే చేయకు నీవిక అలుసు
బొగ్గు పులుసు గాలి నీలో ఉంది
దానితో మాకు కలుగు ఇబ్బంది !

గాలి తల్లి మా చిరుగాలి మల్లి
మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి
నీవు లేకుండా ఉండదు ఏ గల్లి
నీవు వస్తేనే బాగుంటుంది మళ్ళీ !

గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి
హోరుగాలితో చేయకు లొల్లి
చల్లగా తగిలితే కలుగు హాయి
మెల్లెగ మది ఉప్పొంగు నోయి !


కామెంట్‌లు