లాలీజో ఓ పాపా:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి.
లాలీజో లాలీజో ఓ మా పాపా
లాలిస్తూ నే నీ ఉయ్యాల ఊపా
హాయిగా నిద్దురపో నీవు ఈరోజు
తియ్యగా తీర్చుకో నీవిక మోజు.  !

చిర నవ్వులు నీవు నవ్వేవు
చిరుజల్లులు నీవిక రువ్వేవు
మాముద్దుల పాపవు నీవమ్మా
నా సుద్దులనే ఇక వినవమ్మా. !స

నీ ముక్కుకు ముక్కెర చేయిస్తా
నే మక్కువతో నిను నే లాలిస్తా
నిత్యం నే ఆటపాటలను ఆడిస్తా
సత్యం ఆ ఆటపాటలకు పడిచస్తా!

 నే చెవికమ్మలు కూడా చేయిస్తా
నీఆట బొమ్మల జాడను తీయిస్తా
నీకు ముత్యమంత ముద్దు పెట్టేస్తా
నేను మాట తప్పని నీపైన ఒట్టేస్తా!

నీ వేళ్ళకు ఉంగరాలు వేయిస్తా
నీ కాళ్లకు గొలుసులు చేయిస్తా
మారం చేయకు నీవు ఓ పాపా
ఆరాం చేయి నే ఊయల ఊపా !

నీకు బొమ్మరిల్లును ఇక కట్టిస్తా
బేకని నేను కుల్లాయిని కుట్టిస్తా
సోకుగా అమ్మతో బొట్టు పెట్టిస్తా
చూసుకునే అద్దం నీతో పట్టిస్తా 

నీ పుట్టినరోజును కూడా జరిపిస్తా
నే పట్టుపరికిణితో నిను మురిపిస్తా
పొద్దు పోయెను ఓ ముద్దుల పాపా
నిద్దురపో నీవు ఉయ్యాల నే ఊపా


కామెంట్‌లు