అమ్మ పలుకు
తేనె లొలుకు
కన్నె కులుకు
వన్నె తళుకు !
అమ్మ పాడు పాట
తెలుగు ధనం మూట
నాన్న నడచు బాట
ఆడు పాడు పూలతోట !
మామ చెప్పు కథలు
తీర్చుగా మన వెతలు
నీరును ఇచ్చు నూతులు
నీవు తీయకు ఇక గోతులు !
కోకిలమ్మ నల్లన
గోవు పాలు తెల్లన
అడుగేయి మెల్లన
ఏడవకు ఇక గొల్లున !
ముందు ఉంది పండుగ
మందు విందు దండుగ
పున్నమి వెన్నెల నిండుగ
పూసేను పూలు నిండుగ !
పూలమాల కట్టు
పూల తోట పెట్టు
మరిగంటను కొట్టు
బడి బాటలు పట్టు !
బాలకృష్ణుడు నల్లన
బాలచంద్రుడు తెల్లన
నిమ్మ పండు పుల్లన
తాగి చూస్తే మెల్లన. !
పూల తోట పెట్టు
పూలమాల కట్టు
సున్నం గోడకు కొట్టు
కన్నం దొంగను పట్టు !
హలం పట్టితే సేద్యం
తాళం వేస్తే వాయిద్యం
దైవానికి వేస్తే నైవేద్యం
వైద్యుడు చేస్తే వైద్యం. !
ఇల్లు ఊడ్చేది చీపిరి
వింటున్నావా ఓ పోరి
ఎంచుకో మంచి దారి
నీవేగా ఇక సూత్రధారి !
కలానికి కాగితం దోస్తీ
హలానికి భూగోళం ఆస్తి
హలానికి కలానిక లింకు
పెట్టి వ్రాయవోయి కవిత
కట్టిపడేయునోయి భవిత !
తేనె లొలుకు
కన్నె కులుకు
వన్నె తళుకు !
అమ్మ పాడు పాట
తెలుగు ధనం మూట
నాన్న నడచు బాట
ఆడు పాడు పూలతోట !
మామ చెప్పు కథలు
తీర్చుగా మన వెతలు
నీరును ఇచ్చు నూతులు
నీవు తీయకు ఇక గోతులు !
కోకిలమ్మ నల్లన
గోవు పాలు తెల్లన
అడుగేయి మెల్లన
ఏడవకు ఇక గొల్లున !
ముందు ఉంది పండుగ
మందు విందు దండుగ
పున్నమి వెన్నెల నిండుగ
పూసేను పూలు నిండుగ !
పూలమాల కట్టు
పూల తోట పెట్టు
మరిగంటను కొట్టు
బడి బాటలు పట్టు !
బాలకృష్ణుడు నల్లన
బాలచంద్రుడు తెల్లన
నిమ్మ పండు పుల్లన
తాగి చూస్తే మెల్లన. !
పూల తోట పెట్టు
పూలమాల కట్టు
సున్నం గోడకు కొట్టు
కన్నం దొంగను పట్టు !
హలం పట్టితే సేద్యం
తాళం వేస్తే వాయిద్యం
దైవానికి వేస్తే నైవేద్యం
వైద్యుడు చేస్తే వైద్యం. !
ఇల్లు ఊడ్చేది చీపిరి
వింటున్నావా ఓ పోరి
ఎంచుకో మంచి దారి
నీవేగా ఇక సూత్రధారి !
కలానికి కాగితం దోస్తీ
హలానికి భూగోళం ఆస్తి
హలానికి కలానిక లింకు
పెట్టి వ్రాయవోయి కవిత
కట్టిపడేయునోయి భవిత !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి