రామయ్య రామయ్య
అయ్యో మా రామయ్య
చెబితే నీవు వినకుంటివి
తప్పుదారిక కనకుంటివి !
రామయ్యా రామయ్య
అయ్యో మా రామయ్య
సొక్క సోలుతున్నావు
కక్కి తూలు తున్నావు !
రామయ్య రామయ్య
అయ్యో మా రామయ్య
తాగి ఊగవద్దు నువ్వు
తూగి వాగవద్దు దవ్వు !
రామయ్య ఓ రామయ్యస
అయ్యో మా రామయ్య
వాగివాగి మాట పడిపోయె
తాగి తాగి ఒళ్ళు చెడి పోయె !
రామయ్య ఓ రామయ్య
అయ్యో మా రామయ్య
అవసరమా నీకు తాగుడ
అనవసరమే ఆ వాగుడ !
నీకు నీ మతి చెడిపోతుంది
నిన్ను నీ సతి విడిపోతుంది
అల్లరివాడవై మిగిలిపోతావు
చిల్లర వాడవై వెలిగిపోతావు !
రామయ్య ఓ మా రామయ్య
అయ్యయ్యో మా రామయ్య
ఇప్పుడైనా ఈ తాగుడ మాను
అప్పుడు ఔతావిక మంచిగాను !
ఇప్పుడైనా నీవింటావా మా మాట
చప్పుడు చేయక పట్టు ఇంటి బాట
తాగుడు వల్ల ప్రాప్తి నీకు ఆ నరకం
మానవుడు వల్ల నీకు ఇల్లౌ స్వర్గం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి