స్వాగతం !సుస్వాగతం!:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
నాయకులారా ప్రజా నాయకులారా వినండి
మా కోరికల మన్నించి మమ్ముల దీవించండి
వచ్చేసిన నచ్చేసిన మహా నాయకులారా
విచ్చేసిన కల్వకుర్తి గాధల గీతాల గానం చేసిన మా నాయకులారా
            స్వాగతం సుస్వాగ

కలువకుర్తి కవుల కీర్తి పెంచినట్టి
సమయస్ఫూర్తితో మీరంతా పట్టు పట్టి
మా జనం కష్ట సుఖాలను తెలుసుకున్నారు
ఈ దినం సమర్తించి ముందుకొచ్చినారు

బీడు వడ్డ భూములను దర్శించిన మీరు
అడ్డుపడ్డా వారల అడ్డు తొలగించిన తీరు
కల్వకుర్తి ఎత్తిపోతలనే ఎంచుకున్నారు
ప్రభుత్వంతో వాదించి మన ప్రాజెక్టులను సాధించుకున్నారు!

అందుకుంది అందుకే మా వందనాలు
పొందుతూ మీరు ఉండి మా చందనాలు
జనం అందించిన ప్రియ వందనాలు
జన గణం స్పందించిన ఈ తేజోమయ ఇంధనాలు !

అందుకే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం
ముందుగా తెలుసుకోండి ఇప్పుడైనా మా గతం
జనశక్తితో కూడి నడపండి ప్రగతిరతాన్ని 
ఘన కీర్తితో ఇక నిలుపుకోండి మీ జీవన సుగతి పదాన్ని !


కామెంట్‌లు