మిత్రుని సలహాలు:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
భగవంతుని సన్నిధిలో
మేలులుండు మార్గంలో
ఉంటేనే కడు క్షేమము
ఆనందమయం జీవితము

దైవమే హృదయంలో
నిజాయితీ బ్రతుకులో
ఉంటేనే గౌరవము
భవిత అగును ఉన్నతము

తల్లిదండ్రుల ప్రేమలో
వారు చేయు సేవలో
త్యాగమే ఉదయించును
కళ్లెదుటే కన్పించును

పెద్దోళ్ల గద్దింపులో
వారి చేయు బోధలో
ఉజ్వల భవిత ఉన్నది
అక్షరాల సత్యమది

అక్షరమే ఆయుధము
విలువైన ఆభరణము
నమ్ముకుంటే మాత్రము
ఎక్కించును అందలము


కామెంట్‌లు