ప్రకృతి ప్రబోధ గీతిక:- -బాలబంధు గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
మంచినే చూడాలి
మమతనే పంచాలి
సమస్యలు వచ్చినా
సత్యమే పలకాలి

మేలునే కోరాలి
శుభములే తెలపాలి
పదిమంది క్షేమము
మదిలోన తలవాలి

కుళ్లునే వీడాలి
కలతలే మానాలి
ప్రశాంత జీవనానికి
వైరమే తరమాలి

వివక్షత వదలాలి
సమ భావం రావాలి
అందరూ ఒక్కటని
గళమెత్తి చాటాలి


కామెంట్‌లు