కడు చోద్యం!:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
బుద్ధిహీనుని పెదవులు
వదరుబోతుల మాటలు
గమనిస్తేనిశితంగా
నాశనానికి త్రోవలు

ధనవంతునికి స్నేహితులు
అవతారు కోకొల్లలు
తలపింపజేస్తాయోయ్! 
బెల్లంపైనున్న ఈగలు

దాతకు అందరు మిత్రులే
యథార్ధ వాదికి వైరులే
చూడంగా చోద్యమే
లోకంలో సహజమే

వింత వింత పోకడలు
ఎన్నెన్నో చూడు చూడు 
లోకం మాయాబజారు
అశ్చర్యము దీని తీరు


కామెంట్‌లు