నిజమైన దీపావళి:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
దీపాల కాంతితో
ఎనలేని శాంతితో
అందరు బాగుండాలి
ప్రేమలొలుకు మనసుతో

బాణాసంచాయై
విజ్ఞాన జ్యోతియై
తరమాలి చీకట్లు
తొలగాలి ఇక్కట్లు

పేదోళ్ల కళ్ళలో
వారి పూరి గుడిసెల్లో
ఆనంద దివ్వెలు
వెలగాలి బ్రతుకుల్లో

అజ్ఞానం తొలగితే
విజ్ఞానం పండితే
అదేనోయ్! దీపావళి
విశ్వశాంతి వస్తే


కామెంట్‌లు