పంతులమ్మ పలుకులు:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
మరీచికలో నీరును
మూర్ఖుల్లో మార్పును
ఆశించుట వ్యర్థము
అక్షరాల సత్యము

అవినీతిపరులలో,
దుర్మార్గుల మదిలో
అల్పగుణాలధికము
మంచితనం శూన్యము

అబద్దికుల నోటిలో
సత్యాలే నిలవవు
ఎడారి ప్రాంతంలో
పచ్చదనమే కరువు

వానలు కురిస్తేనే
పంటలు పండుతాయి
క్షమను చాటితేనే
చెలిమి పూలు పూస్తాయి


కామెంట్‌లు