చిరు మందహాసము:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
విజ్ఞానం వికాసము
పంచుతుంది వినోదము
ఆర్జిస్తే జీవితము
అగును వర్ణశోభితము

మనసారగ నవ్వితే
ప్రకాశించును వదనము
పైసా ఖర్చు లేనిది
ఆరోగ్యం పెంచునది 

చిరునవ్వులే  ఔషదము
మనసు గెలుచు ఆయుధము
అందుంది గొప్పతనము
పంచుతుంది చక్కదనము

పారిజాత పుష్పమది
రోగాలకు విరుగుడది
మనిషికది బహుమానము
వెలలేని ఆభరణము

డబ్బులతో కొనలేనిది
సృష్టిలో శ్రేష్టమైనది
చిరు మందహాసమే
బ్రతుకున గంభీరమైనది


కామెంట్‌లు