పంతులమ్మ హితవు:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, 9966414580
ఓర్వలేనితనాన్ని
న్యూనతా భావాన్ని
జయిస్తేనే వీరులు
అసూయద్వేషాల్ని

నిరాశానిస్పృహలను
మదిని పిరికితనమును
ఏమాత్రం రానియ్యకు
లక్ష్యం చేరేవరకు

నీచమైన తలపులను
పనికిరాని బుద్ధులను
దూరంగా ఉంచాలి
చెరుపు చేయు వ్యక్రులను

ప్రేమించే మనషులను
ఆదుకున్న ఆప్తులను
వెన్నుపోటు పొడవొద్దు
దూరం చేసుకోవద్దు


కామెంట్‌లు