జీవితంలో ఉండాలి!:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
పాటలోని పల్లవిగా
తోటలోని మల్లియగా
ఉండాలి జీవితంలో
మహోన్నత స్థానంలో

నింగిలోని తారకగా
సొగసులీను చంద్రికగా
ఉండాలి జీవితంలో
తావులీను మల్లికగా

పాల కడలి కెరటంగా
భాస్కరుని కిరణంగా
ఉండాలి జీవితంలో
శిరస్సుపై కిరీటంగా

లక్ష్యమే ధ్యేయంగా
స్నేహమే పవిత్రంగా
ఉండాలి జీవితంలో
విలువలు ఆభరణంగా


కామెంట్‌లు