సృజనే మూలం కదా సృష్టికి.
నిత్య నూతనమవ్వడమే అభివృద్ధికి సూచిక.
ఆవిష్కరణలు ఉపయోగపడితే సర్వమూ సార్థకమవుతుంది.
సాధక,బాధకాల అడ్డంకులు తొలగించుకొని
ప్రగతి రథచక్రాలు మున్ముందుకు పయనించాలి.
కాలమార్పులు సృజనను రాటుదేలిస్తే,
విజ్ఞాన విస్తృతి విధ్వంసం సృష్టిస్తే,
మానవాళి మనుగడ అగమ్యగోచరమే.
ఢీకొట్టే ఆలోచనలకు నింగే హద్దయినపుడు,
అహంకార,మమకారాలు హాహాకారాలు పెట్టిస్తాయి.
నా అనే భావన నయావంచనలకు మార్గం చూపిస్తుంది.
శాంతిసందేశాలు పావురాలై వలసలు పోతుంటాయి.
ఆర్థికమైనా,హార్థికమైనా మేధస్సును సవాల్ చేస్తుంది.
మోజులో పడి మోతెబరి లెక్కలు గణింపబడతాయి.
వృద్ధిరేటు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతుంది.
సారస్యము లేని,అసహజమైన
అంకురాలు అంటుగట్టే
సంస్కృతికి ఆలవాలమవుతాయి.
సూచీలకందని సూత్రాలతో,
సంస్కరణలకందని విశ్లేషణలతో,
నిండామునిగే వ్యాపార,వాణిజ్యాలతో,
ఆశలరెక్కల మొలుస్తాయి.
అర్థగణాంకాల అంకెల గారడీ ఊదరగొడుతుంది.
బులియన్లు బిలియనీర్ల టీ బిస్కట్లవుతాయి.
సెన్సెక్సులు బ్యాంకులను దివాళా తీయించగలవు.
గతము నుండి పాఠాలు నేర్వని,గతితప్పిన రాజకీయం,
నియంతృత్వపు మేకప్పును వేసుకుంటుంది.
అక్షరాస్యత అందినంతా దోచుకుంటే,
సాంకేతికత నేలవిడిచి సాము చేస్తుంటుంది.
ఆర్థిక ప్రణాళికలు ప్రజల జీవనప్రమాణాలను పెంచక,
మాంద్యాలకు మద్దతిస్తాయి.
అన్నమో రామచంద్రా అని
ఆకలికేకలు ప్రపంచమంతా
ఏదో ఒక మూలన వినబడుతూనే ఉంటాయి.
ఆయుధాలు కాలనాగులై కాటేస్తుంటాయి.
యుద్ధం చేసైనా ఆధిపత్యం
అగ్రజమవుతుంది.
ఆఖరికి బతుకు దుర్భరమై,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి