సుప్రభాత కవిత : - బృంద
వెలుతురు కిరణం 
తరిమిన తరుణం
చిక్కని తిమిరం పరుగే!
దిక్కులు దాటెను వెలుగే!

విరిసెను తేజం మెరుపై
కురిసెను కాంతి పుంజమై 
తడిమెను అవనిని తండ్రై
మురియగ మేదిని  పాపై!

వేకువ పాడిన వేదం 
వేడుక సాగిన వైనం 
వేడగ ఒసగే వరం
వేదనలన్ని మాయం!

దైవము తానే రాగా 
కోవెల కాదా జగం!
ధైర్యము క్షేమము తోడై
దీవెన ఇచ్చే బలం!

మౌనపు మంచు కరిగేలా 
మాటల చురుకు తగిలేలా 
భావపు భాష్యం తెలిసేలా 
మదిలో మెరిసే తలపులా......

వెలిగెను తూరుపు వేదికగా 
కన్నుల కాంతులు నింపుతూ
మిన్నుల సాగెను బింబము
కలుగగ మోదము నిండుగా!

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు