విశాఖ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం లలితాపీఠం లో దీపావళి కవి సమ్మేళనం లో కవి రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి చెడుపై మంచికి విజయం
దీపావళి అందరికి ఆనంద కేళి అని కవితాగానం చేసినపుడు విశాఖ సాహితీ కార్యదర్శి డాక్టర్ కందాళ కనక మహాలక్ష్మి గారి స్వహస్తాల తో స్వయంగా ప్రముఖ సాహితీ వేత్త ,రచయిత ఆచార్య దామెర వెంకట సూర్యారావు గారు నిర్వాహకుల సమక్ష0లో
సరస్వతీ సభలో సత్కరించారు. సభలో రచయిత శ్రీపిళ్ళా వెంకట రమణమూర్తి గారు కవి భాగవతుల సత్యనారాయణ మూర్తి గారు,భాగవతుల నీలు మరియు సాహితీ ప్రియులు పాల్గొన్నారు. నడయాడే కాల భైరవ స్వరూపులు కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి వారి చే నిర్వహించబడుతున్న లలితా పీఠం సభాప్రాంగణంలో దీపావళి ముందు సత్కరించబడటం మరువలేనిదని ప్రసాద్ మాష్టారు సంతోషం వ్యక్త పరిచారు.
.......................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి