మొదట బాలిక :- సరోజ రెబ్బాప్రగడ , బెంగళూరు
ఎదిగిన తర్వాత స్త్రీ మూర్తి 
బాలికగానే తుంచేస్తే 
ఇంక స్త్రీ ఎప్పుడవుతుంది 
బానిసత్వ భావాలు మూలాల నుంచి పోవాలి 
పేద, ధనిక తేడాలేకుండా ఇళ్ళల్లో 
ఆడపిల్ల మీద వివక్షత మారాలి 
అప్పుడే ఈ సమాజానికి గుర్తింపు 
ప్రభుత్వాలు ఎన్ని మారినా రాదు 
ఇప్పుడిప్పుడే  స్వల్పంగా మార్పు
 గమనిస్తున్నాము సమాజంలో.. కానీ అది చాలదు 
ఆడదాన్ని దేవతమూర్తిగా చూడానవసరం లేదు 
సాటి మనిషిగా గుర్తిస్తుందా ఈ సమాజం ఎప్పటికైనా?

కామెంట్‌లు