కాదిది కాకి గోల... ఇది ఆ విధి లీల...!- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
మంచి మనసున్నవారితో
మంచితనంతో మమకారంతో సాగిపో...
చెడ్డ మనసున్న వారితో
చెడుగా మసలుకోకు...ఎందుకంటే...

వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు...
ముళ్ళను ముళ్లతో తీయవచ్చు...
పాపాన్ని పుణ్యజలంతో కడుగవచ్చు...
ప్రమాదాన్ని నైపుణ్యంతో దాటవచ్చు...
కానీ,బురదను బురదతో శుభ్రం చేయలేం.!

ఒంటెలా ఎడారిలో నడవగలం...
కానీ, ఎండమావుల్లో నీటిని త్రాగలేం...

నేలపై పడితే లేచి నిలబడగలం...
లోయలో పడితే పైకెక్కగలం...
కానీ, ఊబిలోకి జారిపోతే..?
మృత్యువు ముఖంలో దూరినట్లే..!

వల నుండి చేప జారిపోవచ్చు...
బాణం నుండి పక్షి ఎగిరిపోవచ్చు..
పాము నుండి కప్ప తప్పించుకోవచ్చు
కానీ పులికోరల్లో చిక్కిన జింకపిల్ల
ఆ "పులి ఆకలికి బలి" కాక తప్పదు...!

కాదిది కాకి గోల...ఇదంతా ఆ విధి లీల..!

కామెంట్‌లు