తూరుపు కొండల్లో మెరిసిన మేరంగి పుస్తకం స్వీకరణ

 ప్రముఖ సాహితీవేత్త, దర్శకులు, నటులు, కళాకారులు, సంఘసేవకులు రౌతు వాసుదేవరావు రచించిన తూరుపు కొండల్లో మెరిసిన మేరంగి పుస్తకం ఎంతో ఘనచరిత్రతో కూడుకున్నదని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు. రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం గారి ఆధ్వర్యంలో జరిగిన 
రాజాం రచయితల వేదిక 129వ నెల వారీ సమావేశం రాజాంలో నిర్వహించగా, డా.ఆల్తి మోహనరావు ఈ పుస్తకం గురించి  సమీక్షించారు. పుస్తక రచయిత రౌతు వాసుదేవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి వేదికను అలంకరించారు.
తొమ్మిది సంవత్సరాలు శ్రమించి వాసుదేవరావు రచించిన ఈ పుస్తకంలో పెత్తందార్ల దౌర్జన్యాలు పేదల కష్ట జీవుల అవస్థచుట్టూ అల్లుకున్న సంస్కరణలు తిరుగుబాటు ఫలితాలు అభ్యుదయ భావాలు చోటు చేసుకున్నాయని తిరుమలరావు అన్నారు. సాహితీవేత్త రౌతు గణపతి నాయుడు, శతాధిక వ్యాసకర్త పిల్లా తిరుపతిరావులు వేదికను అలంకరించగా, సమావేశంలో వాసుదేవరావు చేతులమీదుగా తిరుమలరావు ఈ పుస్తకం స్వీకరించారు. పుస్తక రచయిత వాసుదేవరావు చేతులమీదుగా ఈ మహోన్నతమైన పుస్తకం పొందడం మిక్కిలి సంతృప్తినిచ్చిందని తిరుమలరావు తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.
కామెంట్‌లు