బెల్లె డా కోస్టా గ్రీన్ (1879–1950) అమెరికన్ చరిత్రలో అత్యంత ప్రముఖ లైబ్రేరియన్లలో ఒకరు. ఆమె మోర్గాన్ లైబ్రరీని నలభై మూడు సంవత్సరాలు నడిపింది. మొదట్లో జె. పియర్‌పాంట్ మోర్గాన్, తరువాత అతని కుమారుడు జాక్ ప్రైవేట్ లైబ్రేరియన్‌గా, తరువాత పియర్‌పాంట్ మోర్గాన్ లైబ్రరీ (ఇప్పుడు మోర్గాన్ లైబ్రరీ & మ్యూజియం) ప్రారంభ డైరెక్టర్‌గా పని చేశారు.
1905లో, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన జె.పి. మోర్గాన్ ఊహించని ఎంపిక చేసుకున్నారు. ఆయన తన అత్యంత విలువైన సంపదను కాపాడుకోవడానికి ఒక స్త్రీని నియమించుకున్నారు. ఆమె పేరు బెల్లె డా కోస్టా గ్రీన్. ఆమె అమెరికాలోని ప్రసిద్ధ లైబ్రరీలలో ఒక దానిని రూపొందించింది. ఆమె తన కెరీర్‌ను నాశనం చేయగల రహస్యంతో జీవిస్తుందని కొద్దిమందికి మాత్రమే తెలుసు.
1879లో బెల్లె మారియన్ గ్రీనర్‌గా జన్మించిన ఆమె, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి మొదటి నల్లజాతి గ్రాడ్యుయేట్ అయిన రిచర్డ్ గ్రీనర్ కుమార్తె. జాతి కారణంగా తన అవకాశాలను పరిమితం చేసుకున్న సమాజంలో, బెల్లె జీవితాన్ని నిర్వచించే నిర్ణయం తీసుకుంది.
విద్యావేత్తగా పనిచేసిన బెల్లె తల్లిదండ్రులు ఆమె కౌమారదశలో విడిపోయిన తర్వాత, జెనీవీవ్ ఆమె ఇంటిపేరును ఆమె పిల్లల ఇంటిపేరును గ్రీన్‌గా మార్చుకుంది. పోర్చుగీస్ వంశపారంపర్యంగా పేర్కొంది. తన సత్యాన్ని అంగీకరించని ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
జె.పి. మోర్గాన్ వ్యక్తిగత లైబ్రేరియన్‌గా, బెల్లె మోర్గాన్ లైబ్రరీని సాంస్కృతిక మైలురాయిగా మలిచింది. ఆమె యూరోపియన్ కలెక్టర్లతో చర్చలు జరిపింది. అమూల్యమైన మాన్యుస్క్రిప్ట్‌లను సంపాదించింది. పురుషులు ఆధిపత్యం వహించే రంగంలో గౌరవాన్ని సంపాదించింది. అనేక భాషలలో నిష్ణాతులు. ఆమె ఖచ్చితమైన అభిరుచికి ప్రసిద్ధి చెందిన ఆమె కళ, సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరుగా మారింది.
1948లో పదవీ విరమణ చేసినప్పుడు, బెల్లె డా కోస్టా గ్రీన్ స్వయంగా ఒక సంస్థగా మారింది. తెలివితేటలు, ప్రతిభ ఇతరులు విధించే సరిహద్దులను అధిగమిస్తాయని నిరూపించిన మహిళ.
ఆమె వారసత్వం మోర్గాన్ లైబ్రరీలోని ప్రతి మాన్యుస్క్రిప్ట్‌లో కనిపిస్తుంది. అసాధ్యమనుకున్న ప్రపంచంలో ఆమె అనుకున్నది సాధించిన స్త్రీమూర్తిగా చరిత్రపుటలకెక్కింది.
లైబ్రేరియన్ బెల్లె గ్రీన్:- - యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి