కొత్తూరు మండల విద్యాశాఖాధికారి చందక గోవింద స్వామికి కొత్తూరుకవనం సంకలనాన్ని అందజేసినట్లు కొత్తూరు రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు తెలిపారు. పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల నూతన వంటగది భవనం, నూతన తరగతి గది భవనం ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి చందక గోవింద స్వామికి ఈ సంకలనాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మావుడూరు మురళీకృష్ణ వేదమంత్రపఠనంతో, అమ్మల కామేశ్వరి జ్యోతి ప్రజ్వలనతో, కలమట శ్రీరాములు పూలమాలాలంకరణతో, తాను కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టగా, డా.ఎన్ను అప్పలనాయుడు లోగో ఆవిష్కరణలతో ప్రారంభమైన కొత్తూరు రచయితల వేదిక ఈ కొత్తూరు కవనం సారథ్యమని తిరుమలరావు తెలిపారు. కొరవే సభ్యులగు పదిహేను మంది రచించిన ముప్పది రచనలు ఈ సంకలనంలో ఉన్నాయని, దీనిని ఎవీఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్ రూపొందించారని ఆయన తెలిపారు. పాతపట్నం రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పి.రామరాజు, స్వచ్ఛ జీవనం పుస్తక రచయిత రౌతు నరసింహప్పడులు ఈ సంకలనాన్ని ప్రచురించారని ఆయన అన్నారు. మండల విద్యాశాఖాధికారి చందక గోవింద స్వామి మాట్లాడుతూ కేవలం ఆరు నెలల క్రితం డజనుమందితో స్థాపించిన కొత్తూరు రచయితల వేదిక నేడు పాతిక మంది సభ్యులతో ఈ మండలాన సాహిత్య పరిమళాలను వెదజల్లి సామాజిక బాధ్యతను చాటుతోందని అభినందించారు. ఈ కార్యక్రమంలో కొరవే సభ్యులు ఎం.మురళీకృష్ణ, బూడిద సంతోష్ కుమార్, పాతపొన్నుటూరు సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, వైస్ ప్రెసిడెంట్ డోల చిన్నారావు, స్థానిక యువనేత వై.సంతోష్ కుమార్, ఎస్ఎంసి ఛైర్ పర్సన్ బలగ రజనీ కుమారి, విశ్రాంత వీఆర్వో బలగ అప్పారావు నాయుడు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి.రమేష్, పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, అందవరపు రాజేష్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు గొర్లె రామారావు, పిలక వసంత కుమారి, పొత్రఖండ నాగభూషణం, పైసక్కి చంద్రశేఖర్, దాము నీరజ తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు విద్యాధికారికి కొత్తూరుకవనం బహూకరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి