కొంచెం కొంచెం!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
కన్నీరు కరుగదు 
కారుతుంది!.

వెన్న కొంచెం కొంచెం 
కరుగుతుంది!!.

ఐస్ క్రీమ్ కొంచెం కొంచెం 
కరుగుతుంది.!!.

మంచు కొంచెం కొంచెం 
కరుగుతుంది.!!

దీపం కొంచెం కొంచెం 
వెలుగుతుంది.!!

కొవ్వొత్తి కొంచెం కొంచెం 
కరుగుతుంది.!!

పరిమళం కొంచెం కొంచెం 
వ్యాపిస్తుంది.!!

ముసురు కొంచెం కొంచెం 
తరుగుతుంది.!!

చీకటి కొంచెం కొంచెం 
తొలుగుతుంది.!!

నీరు కొంచెం కొంచెం 
పారుతుంది.!!

నిప్పు కొంచెం కొంచెం 
రగులుతుంది.!!?

శ్వాస కొంచెం కొంచెం 
ఆగుతుంది.!!

ప్రాణం కొంచెం కొంచెం 
కోల్పోతుంది.!!?

కన్నీరు కరుగదు 
కారుతుంది.!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం

కామెంట్‌లు