మన దేశంలో రాజకీయాల గూర్చిన ప్రచారం బాగా జరుగుతోంది కానీ వైద్య రంగంలో ప్రముఖుడైన ఆధునిక చికిత్స లో నిష్ణాతుడైన మధుసూదన్ గుప్తాని గూర్చి తెలీకపోటం విచారకరం.1500ఏళ్లక్రితమే భారత్ వైద్య రంగంలో ప్రగతి సాధించింది.ఆధునిక డాక్టర్ గా ఖ్యాతి గాంచిన డాక్టర్ గుప్తా పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో క్రీ.శ.1800లో గొప్ప వైద్యుల కుటుంబంలో పుట్టారు.ఆయన తాత, హుగ్లీ నవాబ్ కుటుంబంకి ప్రత్యేక వైద్యుడు.ఇక మధుసూదన్ 1826 లోసంస్కృత కాలేజీలో పెట్టిన ఆయుర్వేద కోర్సులో చేరి అపూర్వ ప్రతిభ కనపర్చారు. 1830 లో అక్కడే అధ్యాపకులైనారు.లార్డ్ బెంటింక్ కలకత్తాలో ఆంగ్ల వైద్యవిద్యకై మెడికల్ కాలేజీ నెలకొల్పటంతో, 1835లో గుప్తా లెక్చెరర్ గాచేరారు.14నుంచి 20ఏళ్ల వయసున్న 50మంది విద్యార్థులుగా చేరారు.ఆసియాలోనే తొలి డిసెక్షన్ చేసిన వైద్యునిగా గుప్తా కీర్తి గడించారు. రాజారామమోహన్ రాయ్,ద్వారకానాథ్ టాగూర్ ల ప్రోత్సాహంతో సర్జరీ విభాగం ప్రవేశపెట్టిన తరువాత 10 జనవరి1836 లో మధుసూదన్ గుప్త తొలి కెడ్వరిక్ డిసెక్షన్ చేసిన ఆసియా భారత దేశ వాసి కావటం మనకు గర్వకారణం.ఇలా ఇంగ్లీష్ వైద్యం ఊపు అందుకుంది.మన ఆయుర్వేదం మూలపడింది🌹
డాక్టర్ మధుసూదన్ గుప్తా! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి