ఓ మిత్రులారా..!
ఈ
దివ్య
దీపావళి
పర్వదినాన
స్నేహ సుగంధాలతో...
ప్రేమ పరిమళాలతో...
మనసులు మమకారంతో ముడిపడే
వెలుగుల పండుగ జరుపుకుందాం
కాంతి దీపమై...
శాంతి సందేశమై...
ప్రతి ఎదలో వెలుగులు నింపుదాం.
దీపావళి అంటే..?
దీపాల శోభ, చిరునవ్వుల రవళి...
తారాజువ్వలాఎగిసి,ఎగిసి
అంబరాన తాకే ఆనందాల మురళి...
భూచక్రంలా...గిరగిరా తిరిగి
చిచ్చుబుడ్డిలా చిరునవ్వులు చిందించి
నవ్య కాంతుల్ని మనసున నింపే
స్నేహాల సంగమం...
దీపాల మాయాజాలం…
దీపావళి అంటే..?
కేవలం టపాసుల పండుగ కాదు...
మనసున వెలిగే స్నేహదీపాల వేదిక...
బాణాసంచా వెలుగే అంతరంగ గీతమై
ఆనందం ఆలపించే ఉత్సవమే దీపావళి.
క్రాకర్స్ కాల్చి...టపాసులు పేల్చి...
దట్టంగా పొగలు కమ్మి...
చెవులు చిల్లులు పడే...
ధ్వనులతో ఆకాశం దద్దరిల్లితే...
కరెన్సీ కట్టలు మంటల్లో కాలిపోతే...
పొందే ఆ ఆనందం క్షణికమే మిత్రమా!
పేదల గుడిసెల్లో
వెలగని దీపాలు ఉన్నాయి...
అనాధల కళ్ళలో ఆరని ఆశలున్నాయి.
వారి బ్రతుకుల్లో వెలుగుల్ని నింపిన
అదే కదా నిజమైన దీపావళి...
మిత్రులారా..!
క్రాకర్స్ కాల్చడమంటే...
కళ్ళముందే కరెన్సీని కాల్చడమే...
ధనలక్ష్మిని మంటల్లో దహనం చేయడమే.
ఆ ధనంతో అనాధల
అభాగ్యుల ఆకలి తీర్చిన
అప్పుడే కదా మన జన్మ ధన్యం...
మిత్రులారా..! ఈ దీపావళి
ఆశల దీపాలను వెలిగించే
పదిమందికి వెన్నెల వెలుగుల్ని పంచే
నవ్య దివ్య దీపాల మహోత్సవం కావాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి పర్వదినశుభాకాంక్షలు...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి