సామెత -16: - అంతా మన మంచికే
*****
"అవ్వా! అవ్వా! మన సుబ్బయ్య మావ మనవరాలి లగ్గం ఎల్లుండి పొద్దుగాల తెల్సుగద."
"అందుకేనే!ఇగ్గో !గీ అద్దాల రైక లూజైందని పోగుబెట్టుకుంటున్న."
"గద్సరే గని మావ అడావుడి ఆర్భాటం ఎక్కువై తిరుక్కుంట తిరుక్కుంట లపక్కున జారి పడ్డడంట. ఇంగేముంది.పెద్దమ్మ తల్లి మొక్కుకు బోకుండయ్యిన్నని ఒకటే రంధి జేయబట్టిండు.ఈ ముసలోన్ని వదల్లేక,తీస్కబోలేక,ఏ అవుసరం ఎట్టుంటదోనని ఓ నల్గురు ఇక్కన్నే ఆగిపోయిండ్రు."
"అయ్యో! గట్లన.నాకు దెల్వకనే బాయె. పావే! రామీ! సూసొద్దం."
"ఏం సుబ్బయ్య బావా! కూసింతన్న నొప్పి తగ్గిందా? అయినా "అదీ ఒకందుకు మంచిదే లే"!
"ఒసే రామీ! ఇంట్లకెల్లి ఓ పావులో కూసింత తల సమురు బట్కరా! నొప్పి కాడ ఆరంగ ఆరంగ రాసి రుద్దితే గాల్లంత వొచ్చేతల్కి జింక పిల్లోలె ఉరుకులు బెడ్తడు.
" ఓ అవ్వా! నువ్వు రాసుడేమోగని నీ మాటే ముల్కోలె గుచ్చుకుంటాంది. అసలే గాళ్ళతో పోకుంటయిన్నని మస్తు రంధయితుంటే గంత మాట అనబడ్తివి.
గంత ఉల్కెందుకు బావా! గీ మర్దలు పరాష్కమాడిందనుకోరాదు.అనుకుంట పడ్డ సోట మర్దనా చేసి,కాలు జాడిపిచ్చింది.
ఇంటికొచ్చేప్పుడు..."సుబ్బయ్య మావ మస్తు నారాజ్ అయ్యిండు.గట్లెందుకన్నవవ్వా!"
"నా సిన్నప్పుడు మా తాత జెప్పిన "రాజు మంత్రి కత" సెప్త ఇనే ఓపికుందా?..
"రేపొచ్చి ఇంటతీ అవ్వా!" ఎల్లి పోయింది.
**
తెల తెల్లార్క ముందే "అవ్వో! ఓ అవ్వా! అనుకుంట దబడ దబడ తలుపులు బాత్తుంటే... ఏమైందోనని ఒక్కంగలో తల్పు తీసి "ఏమైందే రామీ! ఎవ్వలికేం గాలేదుగా!ఏంది సంగతి! అడ్గుతున్న అవ్వతో....
నీ నాలిక మామూలు నాలిక గాదే అవ్వా! బమ్మ దేవుడు ఏమైనా జర్గబోయే జాతకం రాసిండా ఏంది?
సుబ్బయ్య మావ జారి పడ్డం ఎంత మంచిదైందనుకున్నవ్? లేకపోతేనా ఇల్లు ఇల్లు "దోసకాయ దిన్న కడుపయ్యేది.రాత్రి ఆళ్ళింటికి దొంగలు వచ్చిండ్రంట. మావ, మిగతా నల్గురు ఆ దొంగలను గుతపకట్టెలు అందుకొని బాదుడే బాదుడంట."కుయ్యో! మొర్రో! అన్కుంట దెబ్బలకు బేహోషై అక్కడే పడితే పందిరి గుంజలకు గట్టేసిండ్రు. దా సూసొద్దం.
అవ్వా! గంత మాటంటవాని మస్తు నారాజైన.ఇగ్గో ఇప్పుడు దెల్సింది "అదీ ఒకందుకు మంచిదే" అని చేతులు పట్టుకున్న సుబ్బయ్య వొంక నెలవొంకోలె నవ్వుతూ సూసింది.
గదండీ సంగతి! "అదీ ఒకందుకు మంచిదే" సామెత అర్థము.ఏదైనా జరిగితే అయ్యో! ఎందుకిట్ల జరిగింది అనుకోకుండా దాని వెనకాల ఏదో కారణముందనుకొని బాధ పడొద్దు అనే భావంతో ఈ సామెతను వాడతారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి