శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం
 ఓం ఆర్తిహరాయ నమః
ఓం తపోలక్ష్మ్యై నమః
ఓం వ్రతలక్ష్మ్యై నమః
ఓం వైరాగ్యలక్ష్మ్యై నమః


శ్లోకం:
సంపత్కరాణి సకలేన్ద్రియ నందనాని 
సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని 
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||*

తా.:
కమలముల వంటి కన్నులు కలిగి, దేవతలు అందరిలోనూ పూజ్యురాలవైన మహాలక్ష్మీ! మేము నీకు చేసే నమస్కారములు మాకు సకల సంపదలు కలిగిస్తున్నాయి. మా ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మాకు ‌సామ్రాజ్య పదవిని, అన్ని వైభవాలను ఇస్తున్నాయి. నీకు నమస్కారము చేసినంతనే మా అన్ని పాపాలు దూరమైపోతున్నాయి. నీకు చేసిన నమస్కారము వలన కలిగినవి అన్నీ నిరంతరం మాతో వుంచు తల్లీ.
భావము:
అమ్మా పద్మనయనీ! మా జన్మ జన్మల పాపాలు పోగొట్టుకోవడానికి, అన్ని సంపదలను పొందడానికి, రాజ్య సౌఖ్యాలు అనుభవించడానికి, ఎల్ల వేళలా ఆనందం లో మునకలు వేయడానికి, నీకు మనసా వాచా కర్మణా నమస్కారము చేస్తే చాలు. యజ్న యాగాదులు, క్రతువులు చేయనవసరము లేదు. ఇవి అన్నీ మాకు అన్ని వేళలా వుండడానికి, తల్లి లాగా మా చిటికెన వేలు పెట్టుకొని, నీకు నమస్కారము చేయడం అనే విషయం మేము మార్చి పోకుండా, నీవే నడిపించాలి, పన్నగశయనుని పట్టపురాణీ.
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు