సామెత -28- అన్నం పెట్టినోనికి- సున్నం పెట్టుడు
***
"అవ్వా!ఎంతన్నేలం జర్గిందో జూశినవా!అయినోన్ని కానోన్ని ఇంట్లె బెట్టొద్దంటె ఇన్లె.ఎవ్వలికి బడితె గాళ్ళకు శత్తికి మించి సాయం జెయ్యొద్దంటె ఇన్లే... గిప్పుడు సూడేమయ్యిందో...గోడు జెప్పుకుని గోడు గోడున ఏడుస్కుంట గోడు జెప్పుకోడాన్కి వచ్చింది అంకమ్మ.
"ఓషోషి! ఏడ్వకే తల్లి.ఎవ్వలన్న గిజ్జూసి నేనే నీకు అన్నాలం జేసినన్కుంటరు.జెర్ర మనసు నిమ్మలం జేస్కుని ఏమైందో గా ముచ్చట జెప్పు.
జిర్రున జీది, కళ్ళు తుడ్సుకుంట గీనె మా( మహా )జాలి పడ్కుంట అయినోళ్ళకి అడ్గినంత మాట సాయం,పైసల సాయం జేసిండు.మీకెంద్కు నేనున్ననని దైర్నం జెప్పిండు. గాళ్ళకి ఈనెవుసరం దీరిందేమొ. ఒక్కలంటె ఒక్కలు పిలిస్తె పల్కట్లే. పైసల సంగతి ఏమాయంటె మొఖాలు సాటేస్కుని తిర్గబట్టిండ్రంట.ఒకటే మనాది పడుతుండు.పోతే పోనీయ్ తీ "పోయింది పొల్లు ఉన్నది గట్టి" అని ఎంత జెప్పినా గట్ల జేస్తరన్కోలేదని తెగ ఇదై పోతుండవ్వా!"
అంకమ్మా! గీ లోకం తీరే గిట్లుందే."జాలి, దయ,నావోళ్ళన్న పేమున్నోళ్ళను- ఒకప్పుడు మంచిగుణాలున్న మారాజులు అనేటోళ్ళు. గిప్పుడు ఆట్నే మడిసి బలీనతలు అంటుండ్రు. అవి ఎవుర్లో ఉన్న సత్తెనాసె. గిందుకు తమ్మినే సాచ్చం.
గందుకే మన పెద్దోళ్ళు "అన్నం పెట్టినోనికి- సున్నం పెట్టుడు"అని ఊకె జెప్పలే. గట్ల జేసుడు ఆళ్ళకే సెల్లబాటైతుంది.ఆళ్ళ కాలం నడుత్తుంది ఏం జేత్తం."చేసిన పున్నెం- చెడని పదార్థం" గందుకే మా తమ్మి గంత కట్టం నుంచి చేమంగ బయట పడ్డడు.గది సాల్తీ రంధి జేయకు."
"ఓపాలి తమ్మిని నా తానకి బంపిచ్చు.నే జెప్త తీ.ఇగనించి "ఆసి తూసి అడ్గేయమని" జెప్త."
అవ్వా! అన్నం పెట్టినోనికి- అన్నం బెడ్తె తినొత్తది గని సున్నమెట్ల దింటరే. గట్ల జెయ్యడం తప్పు గదా! మొన్న బల్లే పరీచ్చ రాయనీకి ఓ అన్నకి పెన్ను లేదంటే ఇచ్చిన. గా అన్న రాశినంక ఇయ్యాల గద ఇయ్యనే ఇయ్యలేదు.సేతిల ఐదు రూపాయిల నోటు బెట్టి ఇగ్గో దీంతో గొనుక్కో పో అన్నడు.సంబురంగ కొట్టుకాడికి బొయ్యి ఇత్తె గది సెల్లదు ఉత్తిత్తి నోటని జెప్తె మస్తు ఏడుపొచ్చింది. నీకు జెప్తె తిడ్తవని జెప్పలే అవ్వా!"
మన్వరాలు భూలచ్మి జాలి గుణాన్కి సంబుర పడాలో గట్ల చేసిన గా పోరడి శెకలకి బాద పడాల్నో తెల్వలేదు అవ్వకు.
గసుమంటోళ్ళ వల్లే ఎవురికన్న ఏదన్న సాయం గావాల్నంటె జెయ్యబుద్ది గాదు.కట్టంల ఆదుకుండ్రన్న కుతజ్నత సూది మొనంత సుత ఉండదు. ఎక్కడెక్కన్నించో సోల్తీ గట్టి అడ్గి అక్కర దీర్సుకుంటరు.పైంగ ఆళ్ళకేం బుట్టింది.పెడ్తె పెట్టిండ్రు.ఓ అని దాన్కింత ఇదై పోవాల అన్కునేటోళ్ళు ఎక్కువైండ్రు గీ కాలంల.కలికాలం ఏం జేత్తం."
ఆలోచన్ల బడ్డ"అవ్వని జూసి అవ్వని సుత ఎవలన్న మోసం జేసిండ్రు గావచ్చు" చిన్ని బుర్రలో అన్కోబట్టింది భూలచ్మి.
"గదండీ సంగతి! "అన్నం పెట్టినోనికి- సున్నం పెట్టుడు అంటే" అన్నం పెట్టినంత సాయం జేసి సయిమానికి ఆదుకున్నోన్ని బాధ పెట్టుడంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి