మంచి చెడులు….మాయ మర్మాలు:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-\అత్తాపూర్, హైదరాబాద్
చెడు... 
తేనెటీగ కాటు...
మంచి... 
తేనెలోని తియ్యదనం... 

చెడు...మదిపొలంలో 
పెరిగే ముళ్ళపొద...
మంచి...ప్రేమపంటను 
కాపాడే రక్షణ కవచం... 

చెడు ఉంటే చెవిలో 
గుసగుసమని చెప్పు...
మంచి ఉంటే మైక్ లో
మంగళగానంలా వినిపించు…

చెడు...మనసును 
మండించే చేదు కషాయం...
మంచి... ప్రాణాన్ని 
పులకరింపజేసే…మధురఫలం...

ఎంచిచూడగా ఈ మనుజులందు
మంచి–చెడులు రెండే కులములు
మంచి అన్నది మాలయితే మాల               
 నేనౌదునని పలికె ఏనాడో మన గురజాడ…

మనసంతా చెడుతో నిండిపోతే..?
మంచి చెప్పేవారు బద్దశత్రువులే...
చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులే... 

అందుకే ఓ మనిషీ తెలుసుకో..! 
మంచి చెడుల మాయమర్మాలు 
తెలుసుకొని...మంచిగా మనీషిలా మసలుకో..!



కామెంట్‌లు