రుద్రభూమి: - అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు భగవంతుడైన పరమేశుని గూర్చిన చర్చ జరుగుతోంది క్లాస్ లో.కార్తీక మంతా శివ పూజలేకదా! ఉపోషాలు శివస్మరణ! మాష్టారు అడిగారు" మీరు ఏదేవుడ్ని పూజిస్తారు?" అంతా తలా ఒకపేరు చెప్పారు.గీత అంది" సార్! భాద్రపదం గణేష నవరాత్రులు ఆశ్వయుజం అమ్మవారికి పదిరోజుల పూజలు కార్తీకంలో శివారాధన నెలరోజులు..ఇలా కొడుకు తల్లిదండ్రుల పూజలు ఆపై విష్ణువుని కొలిచే నెలరోజులు.శివ కేశవ భేదం లేక అంతా సమానమే!" అంతా చప్పట్లతో హోరెత్తించారు. శివా అందుకున్నాడు" సర్! నిరాడంబర దైవం శివుడు.అందుకే నాకు ఇష్టం." శివ వాళ్ల నాన్న  కాటికాపరి. రుద్రభూమిలోనే వారి నివాసం."శివా!నీకు స్మశానమంటే భయంవేయదా?" సార్ ప్రశ్నకు ఇలా అన్నాడు" సార్! మాతాత ముత్తాతలనుంచి ఇదే వృత్తి.మాతాత ఇక్కడ చనిపోతే మానాన్నమ్మ ఆయన పని చేసి మానాన్న ను అత్తను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది.మానాన్న ఇప్పుడు అదే వృత్తిలో ఉన్నా నన్ను చదివిస్తున్నాడు.మనం ఇంట్లో హాస్పిటల్ లో చనిపోయాక రుద్రభూమి తెస్తాం. దహనం ఖననం చేస్తాం.ఇల్లు ఆస్పత్రి శవంతో ఉన్న స్మశానాలు కావా? రోడ్ పై ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే అది స్మశానం కాదా? మనిషి ఎక్కడో అక్కడ చావకతప్పదు.శివుడు చూస్తాడు"ఒరే మనిషీ! నీవు ప్రాణంతో ఉన్నంత వరకే నీకువిలువ.ఆపై నీదేహం కమిలి నల్లబడివాసనకొడుతుంది. నీఅంత్యక్రియలు నెత్తిన కొరివి పెట్టాక శవం పూర్తిగా తగలబడేదాకా ఎవరూ ఉండరు.అందుకే సదా నానామస్మరణ చేయరా" అనిచెప్తాడు.మానాన్న అమ్మ శవం దగ్గర ఉండి అదిపూర్తిగా బూడిద కుప్ప అయ్యేదాకా కాపలాకాస్తారు. దొంగల భయం లేకుండ నిర్భయంగా నిద్ర పోతాం.మాకు తిండిపెట్టే గ్రేవ్ యార్డ్ మాకు గ్రేట్.ఎంత గొప్ప వాడైనా మేమున్న చోటికి రావలిసిందే. సదా శివ స్మరణతో చదువుతున్న నాకు భయంవేయదు.మంచి మార్కులు వస్తున్నాయికదా? మానాన్న టెన్త్ పాసైనాడు.నేను బాగా చదువుకుంటాను. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటాను. జాబ్ గ్యారంటీ లేని చదువుకన్న మావృత్తి మిన్న కదా?" శివ మాటల్లో నగ్న సత్యం తొణికిసలాడింది🌹
కామెంట్‌లు