సామెత-29: అదునులేని పైరు - ముదిమి లోని బిడ్డ ఒక్కటే అన్నట్లు
*****
అవ్వా! గీ ఆనలు పాడ్గాను ఇరాం లేకుండా కురుత్తనే ఉన్నయ్. వరి బాయె. మిర్ప బాయె.సివరాకర్కి పత్తి సుత బాయె.గంద్కే గీ మూడిట్ల మల్లోపాలి ఏదన్నొక్కటేశి అదృట్టం ఎట్టుంటదో సూస్కుంటనని ఆయ్న, వద్దని నేను.. కొంపల ఒకటే లొల్లి అవ్వా!మా అస్మంటి బక్క రైతుల్తో గీ కాలమిట్ల చెల్గాటమాడ్తుంది."గందుకే కాల్మొక్త,దండం వెడుతని బుద్గరిచ్చి నీతానకి దీస్కొచ్చిన.ఇంగ నీదె బారం" ఇంట్లె సొదంత ఎల్లబోస్కుని ఓ మూలన పీటేస్కుని కూసుంది లచ్చువమ్మ.
"గా మాటల్కి "తమ్మీ! ఎందుకురా లొల్లి.ఇంటాడిదాని మాట సుత గిసుంటప్పుడు యినాల్రా!ఇంగ ఆటి జోల్కి బోకు. మనస్మంటి బక్క రైతుల్తో కాలమిట్ల చెల్గాటమాడుతుంది.వర్సగ మూడేళ్ళు నుంచి పంట కోసం తెచ్చినప్పు బూడకనే పాయె.గంద్కనే నా మాటిని అదును దప్పిన సయిమంల పంటేసి నట్టబోవుడు కంటె ఏ కూరగాయలో,ఆక్కూరలో ఏసుకున్నవంటె బచాయిత్తవు."అదునుల ఎయ్యని పైరు -ముదిమిల బుట్టిన బిడ్డసుమంటిదిరా తమ్మీ! జెర్ర సోచాయించు."
"గదంత ఇన్కుంట నారయ్య పెళ్ళామొంక జూడంగనే చేతులు జోడిచ్చి కన్పించింది.
అవ్వ మల్లోపాలి ఎచ్చరిచ్చుకుంట" "తమ్మీ! మన్మంత రెక్కల కట్టం గాల్లం. కాలం అదును జూసి బత్కు దారి జూస్కోవాలె గని ఎదిరీత్తనంటె మనొల్లనైద్దా? కట్టం సుఖం దెల్సి జెప్తున్న గీ అవ్వ మాటల్ని మతిల బెట్టుకొమ్మన్జెప్పింది".
కండువా దుల్పి మీదేస్కుంట "అవ్వా !గీ తడవ నీ మాటే ఇన్కుంట గొడ్ల దోల్కపోవాలె.అంబటాలైతె కట్టం" అన్కుంట బోతున్న మొగునొంక తుత్తిగ సూస్కుంట ...
పుత్తెలతాడమ్మి తెత్తనని ఒకటే రసరస.సత్తం-బత్కుదం అన్న దాకొచ్చింది కొంపల.బయ్మేసి నీతాన్కి తీస్కొచ్చిన.ఇల్లు నిలబెట్టిననవ్వా!"
"గింతకి ముదిమిల బుట్టిన బిడ్డసుమంటిది అంటే ఏందవ్వా?
వయసుడిగినంక పుట్టే సంతుని పెంచే ఓపిక కన్నోళ్ళకుండదు.గా చిన్న పొల్లాగాళ్ళు ఈళ్ళకిక సేవలేం జేత్తరు. ఏం సాయమైతరు జెప్పు. ఆళ్ళు పెరిగి పెద్దయ్యే తల్కి గీళ్ళు అస్తోపిస్తో సుత దెల్వదు. గిసంటి అనుబవం నించి ఒచ్చినాట్ని మన్సు బెట్టి యినాల్నే లచ్చిమీ!"
నల్లమబ్బు లెక్క పుట్టెడు దుఃఖంతో వొచ్చిన లచ్చువమ్మ వాన కుర్సింతర్వాత మొయిలొతికె తేటపడి పోతుంటె "చల్లంగ బత్కు బిడ్డా" అన్కుంట దీవెనార్తులిచ్చి పంపింది అవ్వ.
గదండీ సంగతి! "అదును లేని పైరు -ముదిమిలోని బిడ్డ ఒక్కటే " అంటే గదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి