నేనొకసాయంసంధ్యను
దేనికి భయపడక యుంటి దినమొకగండ
మ్మై నీవిక వెలుగుము తొలి
భానుని వైప్రగతిలోన బంగరు పాపా!
నా జీవిత మాయుష్షును
భ్రాతిజమౌనీదుభవిత ప్రతిభలునిండన్
వేజన్మలనీకిచ్చెద
రాజీలేకుండబ్రతుకు రాజీవాక్షా!
నా ముచ్చట విననెవ్వరు
భామలుదరిరారు నీవు బ్రహ్మవువినరా
స్తోమత, వయసుల,గణనము
మాముదిమికినడ్డమయ్యెమనుమడవినరా
నాభాషయెనీకర్థము
ప్రాభాతపు మంగళమ్ము పసి హృదయమ్మున్
శోభాయమానమైనది
స్వాభావిక మమతలనిధి చక్కగ వినురా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి