నింగిలో రంగులకు
నేలకు వేడుకలట!
పొంగుతున్న ఆనందమే
ముంగిట ముగ్గులట!
తెలిసిన పండుగకు
తెలియని ఎదురుచూపు
విరిసిన వెలుతురు పువ్వు
విసిరిన కిరణపు తూపు!
నింగి నేల కలిసే చోట
తొంగిచూసే బాలుడిని
రారమ్మని స్వాగతించె
పరవశించి జగతి!
నేటికి నిన్న గతమైతే
రేపొక కమ్మని కల
మాపున కమ్మిన తలపుల
మరపించే మాయల వల!
రేగిన ఆశల ప్రోత్సాహమే
సాగిన అడుగుల వేగం
మూగిన కలతల నడుమ
వేచిన అరుణోదయం!
మనదన్నది మననే చేరాలని
మునుపే చేసిన నిర్ణయం
వలదన్నది నిలవక పోగా
వచ్చినదే మనకెపుడూ సౌఖ్యం!
మంచి చెడుల భేదం తెలిసి
కొంచెం వరకూ స్వార్థం మరచి
పరులు తానే అనుకుని సాగితే
పరమపదము చేరువ కాదా?
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి