సుప్రభాత కవిత : - బృంద
దారి దీపముగ నీవే 
నను నడిపింప రావా!
కోరిన తీరము చేర
తోడుగా ఉండుము దేవా!

తెలియని మర్మములు 
గెలువగలిగే తెలివినిడి
విడువని మాయలను
వదిలించు  దేవా!

కలిగిన కలతలను 
తలపోసి వగచే
తలపుల తలుపులు
బంధించు దేవా!

తగిలిన కష్టాల వల
తప్పించుకునే వీలు లేక
తలరాతగా తలచు
తత్వము ఎరిగించు దేవా!

బాటలో మలుపులన్నీ 
తోటలో పూలుగా 
హాయిగా అనిపించు 
భావన ఒసగుము దేవా!

కాలికి తాకు కంకరలన్నీ
విరులుగా మారకపోయినా
కంటకములై బాధించక
కాపాడుము దేవా!

దోవ పొడుగునా సోకు 
నీ కరుణ కాంతులతో
నా గమనమునకు 
మార్గదర్శివై నడుపు కర్మ సాక్షీ!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు