ఆనందాల బాల్యం..! :- .. కోరాడ నరసింహా రావు.
ఆటల పాటల పిల్లలు
 అల్లరి చేసే పిల్లలు
 మురిపాల పిల్లలు
  ముద్దొచ్చే పిల్లలు

ఆ టాడు కుందాం రా... 
   ఒకరి నొకరు పిలుచు కుంటు... 
   తోట లోకి జేరి నారు 
ముద్దులొలుకు పిల్లలం త ...! 

చేయి చేయి కలుపుకుని
 పాటేదో పాడు కుంటు... 
 ఆటలలో పడి పిల్లలు
  కాలమునే మరచి నారు! 

ఆటల పాటల ఆనందం
   బాల్యానికే సొంతం 
కల్మశ మెరుగని నిర్మల మనసులు 
    బేధా లెరుగని బంగరు బా ల లు...! 

హాయిగ ఆటలు ఆడండి 
 చక్కగ పాటలు పాడండి
 జీవితంలోనిమాధుర్యాన్ని
 హాయిగా అనుభ వింఛండి..!! 
     ******


కామెంట్‌లు