అక్షరాలా కవిత్వం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆలోచనలు
పుడుతున్నాయి -
శిరస్సును
నింపుతున్నాయి.

విషయాలు
వెంటబడుతున్నాయి -
భావాలు
బయటకొస్తున్నాయి.

అక్షరాలు
అల్లుకుంటున్నాయి -
అర్ధాలు
స్ఫురించుతున్నాయి.

పదాలు
పారుతున్నాయి -
వాక్యాలు
వరుసకడుతున్నాయి.

కలాలు
గీస్తున్నాయి -
పుటలు
నిండుతున్నాయి.

అందాలు
అగపడుతున్నాయి - 
ఆనందాలు
అందిస్తున్నాయి.

బొమ్మలు
గీయబడుతున్నాయి -
రంగులు
అద్దబడుతున్నాయి.

శిలలు
చెక్కబడుతున్నాయి -
సొగసులు
సంతరించుకుంటున్నాయి.

కవితలు
కూర్చబడుతున్నాయి -
సృజనతరంగాలు
సాహితీసింధువులో ఎగిసిపడుతున్నాయి.

గుండెలు
ప్రతిధ్వనిస్తున్నాయి -
హృదులు
ఆకర్షింపబడుతున్నాయి.

కవినైపుణ్యం
కాగితాలకెక్కుతుంది -
కవితామహత్యం
కనబడుతుంది.

కవిత్వం
అక్షరాలా - అత్యద్భుతం,
కళ్ళారా - కడుకమనీయం,
మనసారా - మిక్కిలిమాధుర్యం.


కామెంట్‌లు