సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము పంచమాశ్వాసము సమాప్తం-*28 వ రోజు
పాండవులు కౌరవుల విద్యాభ్యాసం
ద్రోణాచార్యుడు హస్థినలో ప్రవేశించే సమయంలోజరిగిన సంఘటన ఆయనను పాండు సుతులకు కౌరవులకు గురువైయ్యేలా చేసింది. పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది. వారు దానిని తీయటానికి విఫల ప్రయత్నం చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడకు కుటుంబ సహితంగా వచ్చిన ద్రోణాచార్యుడు ఆ బంతిని ఒకదాని తరువాత ఒక బాణాన్ని వేస్తూ బయటకు తీసి ఇచ్చాడు. రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ద్రోణుని రాజకుమారులకు ఆ చార్యునిగా నియమించాడు. విద్య నేర్పడానికి ముందు అతడు రాకుమారులను చూసి మీలో నాకోరికను తీర్చగలవారు ఎవ్వరు అని ప్రశ్నించాడు. అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి గురుదేవా నేను మీరు ఏది కోరితే అది చేస్తాను అన్నాడు. దేశదేశాల నుండి వచ్చిన రాకుమారులతో దృపదుని కుమారుడు కర్ణుడు కూడా ద్రోణుని వద్ద విద్యనభ్యసించ సాగాడు. కర్ణుడు మాత్రం ఎప్పుడూ దుర్యోధన పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం గురువును వినయ విధేయతలతో సేవిస్తూ ద్రోణుని ప్రేమాభిమానానికి పాత్రుడైయ్యాడు. అశ్వత్థామకు అర్జునుడంటే విద్యామత్సరం ఉండేది. ఒక రోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం ఆరిపోయింది. అర్జునుడు చీకటిలో అన్నంతింటూ ఉండగా చీకటిలో బాణప్రయోగం కూడా చేయవచ్చన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చేయనారంభించాడు. అది చూసి ద్రోణుడు అర్జునుని పట్టుదలకు మెచ్చి పరశురాముని వద్ద తాను నేర్చుకున్న విద్యనంతా నేర్పించాడు. దుర్యోధనాదులు భీముని బలం అర్జునిని విలువిద్యా నైపుణ్యం సహించలేక పోయారు. ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకు విలువిద్యలో పరీక్ష పెట్టాడు. ఒక పక్షి బొమ్మను చెట్టు కొమ్మకు కట్టి ఒక్కొక్కరిని పిలిచి వారి ఏకాగ్రతను పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవరికీ తగినంత ఏకాగ్రత లేదని గ్రహించాడు. ఒకరోజు ద్రోణుడు నదిలో స్నానమాచరిస్తుండగా ఒక మొసలి అతని కాలును పట్టుకుంది. అతడు రక్షించమని వేసిన కేకలకు రాకుమారులంతా దిక్కుతోచక పరుగెడుతున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా బాణం వేసి గురువుని రక్షించాడు. ఎప్పటికైనా అర్జునుడు ఒక్కడే దృపదుని పట్ల తనకు కలిగిన పగ చల్లార్చ గలడని గ్రహించి ద్రోణుడు అర్జునునికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు.
ఏకలవ్యుడు
ద్రోణుని కీర్తి విని హిరణ్యధన్వునుడు అనే ఎరుకల రాజు కుమారుడు ఏకలవ్యుడు అతనిని తన గురువుగా ఎంచుకున్నాడు .అతడు ద్రోణుని వద్దకు వెళ్ళి విలువిద్య నేర్పమని కోరాడు. హీనజాతి వాడికి విలు విద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించలేదు. పట్టువదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని విగ్రహం పెట్టి భక్తితో విలు విద్యను సాధన చేసాడు. ఒక రోజు పాడవులు, కౌరవులు సమయంలో పాండవుల వేట కుక్క తప్పించుకు పోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలో మొరగ సాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు. ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతకు రాగా అది చూసిన రాకుమారులు ఆబాణాలు సంధించిన నైపుణ్యం విస్మయపరచింది. వారు వెతుక్కుంటూ ఏకలవ్యుని చూసి అతడు ద్రోణుని శిష్యుడని అతనిద్వారానే అడిగి తెలుసుకున్నారు. అర్జునుడు ద్రోణునితో "గురువర్యా నేను మీ ప్రియశిషుణ్ణి అని చెప్పారు కదా నాకంటే ఏకలవ్యుని విలువిద్యలో నైపుణ్యత అధికంగా ఇచ్చారెందుకు " అని వేదనగా అడిగాడు. ద్రోణుడు అర్జునునితో ఏకలవ్యునికి దగ్గరకు వెళ్ళి అతని వద్ద గురుదక్షిణగా అతని బొటన వ్రేలిని గ్రహించి అర్జునుని జగదేక వీరునిగా చేసాడు.
ఆది పర్వము పంచమాశ్వాసము సమాప్తం

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు