నిజం! చిన్న కథ ....అచ్యుతుని రాజ్యశ్రీ

 "శివా! ఏంచేస్తున్నావు?" " దీపావళి పండగకి ఇల్లు సర్దుతున్నా తాతా! మంచి కథ చెప్పవూ? అది వింటూ కొత్త కథ బడిలో చెప్తాను." "శివా! అందరూ దేన్ని గూర్చి భయపడ్తారు?" "ఓష్! భయానికి బోలెడన్ని కారణాలు.పిల్లలకి చీకటి మాకు పరీక్షలు " "ఉహూ! మనిషిని పట్టిపీడించేది చావు భయం!" "అదేంటి తాతా! బాగా ముసలివారైనాక కళ్లు కాళ్లు పనిచేయక మంచంలో పడిఉన్నప్పుడు కదా మనిషి చనిపోయేది?" తాత నవ్వాడు"చావు అంటే భయం కి ఓకథ చెప్తా విను.ఒక రాజు కి ఎప్పుడూ యవ్వనంగా ఉండాలని ముసలితనం రాకూడదనే కోరిక తో ఓసాధువుని అడిగాడు."నాయనా! అక్కడ మూడు తరాల వ్యక్తులున్నారు. వారితో మాట్లాడు" రాజు అక్కడ తాత కొడుకు మనవడు 50,100150 ఏళ్ల వాళ్లు పోట్లాడుకోటం చూశాడు.ఆస్తి ఇల్లు కావాలని వారి గొడవ."నాకు శక్తి బలం ఉంది.ఇంటి పెద్దని. మీరు నేను చెప్పినట్లు వినాల్సిందే" 150ఏళ్ల ఆయన అరుస్తున్నాడు.కొడుకు మనవడు అతని గొంతు పిసుకుతూ నిన్ను చంపి లాగేసుకుంటాం.ఆధునిక వైద్యంతో బానే బతికావు" అని హత్య చేయబోతున్నారు. రాజు ఇంకో వైపుకు వెళ్లాడు.ఓవృద్ధ అవ్వ గుడిదగ్గర మూల్గుతూ" దేవుడా! ఏమిటీ పాడు బ్రతుకు!? నా మగడు కొడుకులు పోతే మనవలు బైటకి గెంటేశారు.వృద్ధాప్యం శాపం.." అని మూలుగుతూ ఏడుస్తోంది.రాజుకి కనువిప్పు కలిగింది.శివా! నీతి ఏంటి?" "తాతా!పువ్వు పిందె కాయ పండుగా మారి రాలిపోవాల్సిందే. చావంటే భయపడకూడదు. ఉన్న నాల్గురోజులు మంచిపనులు చేస్తూ అబ్దుల్ కలాంగారిలా అనాయాసమరణం కోరుకోవాలి." తాత అన్నాడు"అదే భగవద్గీత సారం "🌷
కామెంట్‌లు