మనసున మనసై...
బ్రతుకున బ్రతుకై...
చీకటి మూసిన ఏకాంతములో
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు...
నీ కోసమే కన్నీరు నించుటకు...
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...
తోడొకరుండిన అదే భాగ్యము...
అదే స్వర్గము అన్నారు మహాకవి శ్రీశ్రీ ...
నీ కంటినుండీ రాలే
నీ కన్నీటి చుక్కలను
తుడిచే చల్లని చేతులు...
ఆపదలో అవసరాల్లో నిన్ను
ఆదుకునే అభయహస్తాలు ...
నీ కష్టాలకు కరిగిపోయే
కరుణార్ద్రహృదయులు...
తోడొకరుండిన చాలు...
అదే భాగ్యము...అదే స్వర్గము...
నిన్ను గాఢంగా
ఎంతో ఆత్మీయంగా
ఆలింగనం చేసుకుని
ప్రేమతో చిరునవ్వుతో
పలకరించే ప్రేమమూర్తులు..
తోడొకరుండిన చాలు...
అదే భాగ్యము...అదే స్వర్గము...
నీవు సమస్యల
సుడిగుండంలో
కూరుకు పోయినప్పుడు...
కృంగి పోయినప్పుడు...
భయపడకు...బాధపడకు...
కృంగిపోకు...కుమిలిపోకు...
దిగులు పడకు...దిక్కులు చూడకు...
వెనుక ఎవరూ లేరని నిరాశ చెందకు...
నేనున్నానని...నీకేం కాదని...
భుజం తట్టే...భరోసా నిచ్చే...
తోడొకరుండిన చాలు...
అదే భాగ్యము...అదే సౌభాగ్యం...
అదే స్వర్గము...అదే కొండంత అండ...
అంతులేని సంతోషమే మన మది నిండ...
ఆ జీవితమే ఖుషీ కులాసాల చల్లనికుండ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి