విద్యార్ధి దశలో పోతురాజు చూపిన ప్రతిభ ప్రశంసనీయం: - ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
పోతురాజు,తల్లి తిరుపతమ్మను సత్కరిస్తున్న ఎమ్మెల్యే

     సత్తుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతూ విద్యార్ధి దశలోనే అద్భుతమైన కధలు రాసి ఆవుల పోతురాజు నేటి విద్యార్ధులకు స్ఫూర్తిగా నిలిచాడని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.గురువారం సత్తుపల్లిలో గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ ప్రచురించిన పోతురాజు బాల సాహిత్య రచన 'నాన్నే నాహీరో'పుస్తకాన్ని ఎమ్మెల్యే దంపతులు రాగమయి దయానంద్ ఆవిష్కరించారు.పిల్లల లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినట్లయితే పోతురాజు వంటి ఆణిముత్యాలు సమాజానికి అందుతారని ఆమె పేర్కొన్నారు.పేదరికం  సృజనాత్మక శక్తికి అడ్డు కాదని,గుడారంలో నివసించినా తన రచనా ప్రతిభను సమాజం గుర్తించేలా పోతురాజు కృషిచేసాడని అభినందించారు.ప్రతిభ గల పేద విద్యార్ధులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలిపారు.
          పోతురాజును తల్లి తిరుపతమ్మను,పోతురాజును ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయిని ఎం.రమాదేవి,ఎన్.సి.హెచ్. వెంకటాచార్యులు దంపతులను,ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోందు షేక్,ప్రచురణ చేసిన గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు.
              కార్యక్రమంలో ఆషా డైరక్టర్ రామిశెట్టి శ్రీనివాసరావు,పసుపులేటి నాగేశ్వరరావు,మహమ్మద్ షాకీర్ హుస్సేన్, గోలి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు