ఇగో :- డా ప్రతాప్ కౌటిళ్యా.
అందరూ మరణించేవాళ్లే 
అందరూ ఏడిపించే వాళ్ళే
అందరూ విడిపించే వాళ్లే 

ఏడిపించినవాడు
మరణించిన వాడు 
ఒకడేనా....!?

మరణించిన వాడు 
విడిపించినవాడు 
ఒకడేనా....!?

పాదరసంతో 
ఎంతసేపైనా ఆడుకోవచ్చు 
కానీ 
సీసంతో ఆడుకోలేం...!?

నీరు నిప్పుతో 
ఆడుకుంటుంది. 
కానీ 
సోడియం తో కాదు.!!?

ఇప్పుడు 
కులం అంటే బుద్ధి!!
కులం అంటే ధనం!!?
కులం అంటే ఇగో..!!!?

డా ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు