*ఆరోగ్యమే... మహా భాగ్యము * !
సిరి,సంపదలెన్నియున్న ఆరోగ్యము లేనినాడు...
ఆనందము సున్న!!
శారీరకంగా బాగుంటేనే...
మానసికంగా బాగుంటా మన్నది...
నిజమే ఐనా....,
కేవలం శరీరం ఆరోగ్యంగా ఉన్న వారంతా ...
మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా...!?
మనసు మీద ఎన్నెన్ని విషయాలు ప్రభావం చూ పిస్తాయని...!
ఆర్ధిక, సామాజిక,సాం ఘిక, సాంస్కృతిక,కుటుంబ,స్నే హ.....
ఇలా ఇంకెన్నో...!!
అన్నట్టు వ్యస నాల ప్రభావం కూడా ఉంటుందండోయ్...
మరీ ముఖ్యంగా ...
మనసును స్పందింప జేసి... హృదయాన్ని ప్రతి స్పందింప జేసే గ్రంధులు!
ఇవి మన శరీరంలో తగు మోతాదులో ఉంటేనే...,
తక్కువైనా ఇబ్బందే...
ఎక్కు వైనా ప్రమాదమే!!
నిజానికి ఈ మానసిక ఆరోగ్య మనేది...
మన చేతుల్లో కొంతే...!
అంతా... పూర్వ కర్మల ప్రభావమే !!
ప్రస్తుత మైతే...
మన చేతుల్లో లేక పోయినా...
ఎవరి భవిష్యత్తు వారి చేతుల్లోనే...!
వారి చేతలలోనే...!!
రేపటిని దృష్టిలోపెట్టుకుని
నేడు ప్రవర్తిద్దా0...
నేటి సత్ప్రవర్తనతో...
రేపు ఆనందముగా జీవి ద్దాము...!
ఆరోగ్యమే మహాభాగ్యము కదా....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి